శాసనసభలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి… కీలక వ్యాఖ్యలు చేసారు. మాగంటి గోపినాథ్ క్లాస్ గా కనిపించే మాస్ లీడర్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థి దశ నుంచే ఆయన చురుకుగా ఉండేవారు… 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

1985 నుంచి 1992 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారన్నారు. మాగంటి గోపీనాథ్ ఎన్టీఆర్ కు గొప్ప భక్తుడు… సినీ రంగంలోనూ ఆయన నిర్మాతగా రాణించారని కొనియాడారు. రాజకీయంగా పార్టీలు వేరై నా.. వ్యక్తి గతంగా గోపీనాథ్ నాకు మంచి మిత్రుడు అన్నారు. మాగంటి గోపీనాథ్ లేని లోటు తీర్చలేనిది.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.