ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్రలో విషాదం నెలకొంది. సియాసత్ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి చెందారు. గద్దర్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జహీరుద్దీన్ అల్వాల్ వెళ్లారు. ఛాతి నొప్పితో అలీఖాన్ కింద పడిపోయారు. ఛాతి నొప్పితో అలీఖాన్ కింద పడిపోయారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. జహీరుద్దీన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే జలీల్ ఖాన్ మృతదేహాం ఉంది.
గద్దర్ ఇంటి నుంచి బయలు దేరిన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. వేలాది మంది అభిమానుల అశ్రు నయనాల మధ్య అంతిమయాత్ర స్కూల్ అవరణకు చేరుకుంది. అప్పటికే వేలాది సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులతో స్కూల్ ప్రాంగణం నిండిపోయింది. దీంతో పోలీసులు బయట ఉన్న వారిని లోపలికి రాకుండా కట్టడి చేశారు. స్కూల్ గేట్లను మూసివేశారు. అయితే.. చివరి చూపు కోసం వేలాది మంది ఒక్కసారిగా తోసుకుని ముందుకు సాగారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు పడ్డారు. ఈ తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.