చైసామ్ డివోర్స్..సిద్ధార్థ్ ట్వీట్ వైరల్..!

-

ముందు నుంచి వార్తలు వచ్చినట్టుగానే నాగచైతన్య సమంత విడిపోయారు. తాము విడిపోతున్నట్లు సమంత మరియు చైతూ ఆఫీషియల్ గా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ వార్త అందరినీ షాక్ కు గురి చేసింది. ఇక నాగార్జున కూడా విడాకుల అంశం పై ఎమోషనల్ ట్వీట్ చేశారు. అయితే తాజాగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే హీరో సిద్ధార్థ ఓ ట్వీట్ చేయడం ఇప్పుడు మరో సంచలనంగా మారింది.

మోసగాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే…. మరి మీరేం నేర్చుకున్నారు..? అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ లోకి నెటిజన్లు సమంత ను లాగుతున్నారు. గతంలో సమంత-సిద్ధార్థ్ ల మధ్య రిలేషన్ షిప్ ఉండేదని అందువల్లే సిద్ధార్థ్ ఇప్పుడు ఇలా ట్వీట్ చేశాడు అని కామెంట్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఇలాంటి సమయంలో ఈ ట్వీట్ అవసరమా సిద్ధార్థ్ అతడిపై మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version