ఆ జీన్స్ వేసుకుని 8 గంటలు అయింది…కట్ చేస్తే సీన్ ఐసీయూలో 4గంటలపాటు మృత్వువుతో..

-

ఫ్యాషన్ ప్రపంచంలో అమ్మాయిలదే హవా..సరికొత్త హంగులతో ఎప్పటికప్పుడు అందంగా ఉండాలనుకుంటారు. మార్కెట్ లో కి వచ్చిన ఏ ట్రెండింగ్ ఐటమ్ ని వదలరూ..దాదాపు అమ్మాయిలంతా అప్డేట్ గానే ఉండాలని కోరుకుంటారు. ఫ్యాషన్ ఐకాన్…అయిన టైట్ జీన్స్ హే ఓ అమ్మాయికి ముప్పతిప్పలు పెట్టింది. అసలు గంటల తరబడి జీన్స్ వేసుకుంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా సరే తగ్గేదేలే అంటున్నారు అమ్మాయిలు. తాజాగా ఓ మహిళ టైట్ జీన్స్ ని 8 గంటల పాటు ధరించినందుకు ఐసీయూలో 4 గంటలుపాటు చికిత్స చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి..

నార్త్‌ కరోలినాకి చెందిన 25 ఏళ్ల సామ్‌ మూడేళ్ల క్రితం తన బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి డేటింగ్‌కు వెళ్లింది. అప్పడు ప్రియుడి కోరిక మేరకు బిగుతుగా ఉండే షార్ట్ జీన్స్ ధరించింది. 8 గంటల తర్వాత ఇంటికి చేరిన సామ్‌కు నడుము క్రింద నొప్పి స్టాట్ అయిందట. మరుసటి రోజు డాక్టర్‌ని సంప్రదించడంతో సెప్సిస్‌, సెల్యులైటీస్‌ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ సోకిందని తేలింది. ఈ ఇన్ఫెక్షన్ తీవ్రతరమైతే.. రక్తం ద్వారా ఒళ్లంతా వ్యాపించి, అవయవాలు విఫలమై ప్రాణాపాయం సంభవించే ఆస్కారం ఉందట.

ఆరోజు ఏం జరిగిందంటే..

తొలుత ఆస్పత్రిలో చేర్పించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యులు వెంటనే ఆమెను ఐసీయూకి మార్చారు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్సనందించారు.ఆ తర్వాత కూడా తను కొన్ని రోజులపాటు ఆసుపత్రిలోనే ఉండి వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది. చికిత్స సమయంలో మాటిమాటికీ ప్యాంట్‌ను తీసి వైద్యులకు గాయాన్ని చూపించాల్సి వచ్చేదని, ఇది చాలా చేదు అనుభవమని, దాదాపు చావు అంచుల వరకూ వెళ్లాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. తను చవిచూసిన చేదు అనుభవాన్ని వీడియో  ద్వారా ఇప్పుడు పంచుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది. ఇంత అరుదైన వ్యాధి జీన్స్‌ వల్ల ఎలా వస్తుందా అని అందరిలో ఇప్పుడు డౌట్ మొదలైంది.

అందుకే ఇన్‌ఫెక్షన్లు వస్తాయి..

బిగుతైన దుస్తులు ధరించినప్పుడు చర్మం కోతకు గురై ఇన్‌ఫెక్షన్‌ కలిగించే బ్యాక్టీరియా జీవించడానికి అనుకూలంగా ఉండే తేమలాంటి పదార్థం అనోరెక్టల్ అబ్‌సెస్‌ పేరుకుపోతుందట. దీనికి తక్షణమే చికిత్స చేయకపోతే, ఆ ప్రదేశంలో చర్మగ్రంధులు మూసుకుపోయి ప్రాణాంతక ఇన్ఫెక్షన్‌గా మారుతుంది. సాధారణంగా ఇమ్యునిటీ బలహీణంగా ఉండే వారికి ఇది సోకే అవకాశం ఎక్కువని వైద్యులు సూచిస్తున్నారు. ఇమ్యునిటీ తక్కువగా ఉండేవాళ్లకే అన్నిరోగాలు వస్తాయి. మంచి పోషకవిలువలు ఉన్న ఆహారం తీసుకోని..శరీరంలో ఇమ్యునిటీ పవర్ ఎక్కువగా ఉంచుకుంటే..చిన్నిచిన్నవాటికే అనారోగ్యంపాలు కావల్సిన అవసరం ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version