పవన్‌ పగటి వేషగాడిగా వ్యవహరిస్తున్నారు : మంత్రి అప్పలరాజు

-

నిన్న శ్రీకాకుళం సభలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి అప్పలరాజు కౌంటరిచ్చారు. ఈ జన్మకు పవన్ కళ్యాణ్ సీఎం కాలేడని మంత్రి అప్పలరాజు చెప్పారు. అమ్ముడుపోవడమే పవన్ కళ్యాణ్ నైజమన్నారు మంత్రి అప్పలరాజు. అందుకే ఆయన సీఎం కాలేడన్నారు. మీరు తనను గెలిపిస్తారని చెబితే ఒంటరిగా పోటీ చేస్తానని నిన్న సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి గుర్తు చేశారు. అందుకే వీర మరణం అవసరమా అంటూ వ్యాఖ్యలు చేశారని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇటీవల చంద్రబాబును కలిసిన సమయంలోనే కొంత అడ్వాన్స్ ను పవన్ కళ్యాణ్ తీసుకున్నాడని ఆయన ఆరోపించారు. పవన్‌ పగటి వేషగాడిగా వ్యవహరిస్తున్నారని మంత్రి అప్పలరాజు విమర్శించారు. ఇక రానున్న రోజుల్లో టీడీపీతో కలిసి వెళ్దామని పవన్ కళ్యాణ్ చెబుతారన్నారు. వీరమరణం అంటూ పవన్ కళ్యాణ్ దయనీయమైన మాటలు మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే పగటి వేషగాళ్లు గుర్తుకు వస్తున్నాయని మంత్రి చెప్పారు.

కార్యకర్తల్లో స్పూర్తి నింపేలా మాట్లాడాలి కానీ ప్యాకేజీ మాటలు మాట్లాడవద్దని మంత్రి అప్పలరాజు పవన్ కళ్యాణ్ కు హితవు పలికారు. జనసేన కార్యకర్తల కష్టాన్నిచంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తాకట్టు పెడుతున్నారని మంత్రి ఆరోపించారు. సీఎం జగన్ సింహం లాంటివాడన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి గ్రామ సింహనికి జగన్ భయపడరని మంత్రి చెప్పారు. మొరిగే కుక్కలు జగన్ వెంట్రుక కూడా పీకలేరన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి కూడా మంత్రి అప్పల రాజు కౌంటరిచ్చారు. ఆనాడు వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో గుడ్డలూడదీసీ కొట్టాలని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల గురించి మంత్రి మాట్లాడారు. రెండు చోట్ల పోటీ చేసినా కూడ ప్రజలు ఓడించి పవన్ కళ్యాణ్ గుడ్డలూడదీశారన్నారు. అసెంబ్లీ గేటు దాటకుండా పవన్ కళ్యాణ్ గుడ్డలూడదీశారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version