నాగుల పంచమి… పూజా విధానం !

-

నాగుల పంచమి అనగానే ఉదయాన్నే బావి వద్దక వెళ్లి స్నానమాచరించి ఏమీ తినకుండా చాలా నిష్టగా ఉండాలనే తెలుసు. రోజూ చేసినట్లుగా పూజ చేసి తర్వాత మిగతా పనుల్లో నిమగ్నమవుతారు. నాగేంద్రుడుకు ప్రత్యేకమైన పూజ చేయాలి. దానికో పద్ధతి కూడా ఉంది. నాగుల పంచమి రోజున చేసే పూజా విధానం మీ కోసం.

నాగుల పంచమి రోజున నాగదేవతలను పూజించేవారికి ఐష్టెశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. అందుకని నాగుల పంచమిరోజున నాగేంద్రా! మేము మా వంశములో వారం నిన్ను ఆరాధిస్తున్నాము. పోరపాటున తోక తొక్కితే తొలిగిపో. నడుం తొక్కితో నా వాడనుకో.. పడగ తొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రి అంటూ ప్రదక్షిణ, నమస్కారాలు చేయాలని పురోహితులు అంటున్నారు. ఇంకా ఆ రోజు ఉదయం ఐదింటికి లేచి, శుచిగా స్నానమాచరించి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. తర్వాత పైజామందిరం, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్ర్తాన్ని పురుచుకోవాలి. నాగేంద్రస్వామి ప్రతిమను గానీ, లేదా ఫోటోను గానీ పూజకు ఉపయోగించాలి.

పూజకు మందారపూల, ఎర్రటి పువ్వులు, కనకాంబరములు.. నైవేద్యమునకు చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిఇలను సిద్ధం చేసుకోవాలి. ఉదయం 9 గంటలలోపు పూజ పూర్తి చేయాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము. నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో ఓం నాగేంద్రస్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

దీపారాధనకు నువ్వులనూనెను వాడాలి. 7 దూదివత్తులు, ఆవునేతితో సిద్ధం చేసుకున్న దీపములతో హారతినిచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిశాక నాగేంద్ర స్వామి నిత్యపూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి ముత్తైదువులకు అందజేయాలి. ఇకపోతే.. నాగుల చవితి నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం.

అలాగే.. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించడం శుభదాయకం. ఇంకా మోపిదేవి ఆలయం, నాగేంద్రస్వామి పుట్టలను నాగుల పంచమి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు. అందుచేత నాగుల చవితి రోజున నాగదేవతలను నిష్టతో పూజిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news