భారత ప్రభుత్వం ప్రవేసపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రపంచ నలుమూలల నుంచి అతి కొద్దిమంది నుంచీ నిరసన గళం వినిపిస్తోంది. ఈ క్రమంలోనే విదేశాలలో ఉంటున్న భారతీయులు ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ కటకటాల వెనక్కి వెళ్తున్నారు. ఈ మధ్య కాలం లో నిరసనలు తెలియచేస్తూ, అమెరికా, దుబాయి వంటి దేశాలలో భారతీయులు అరెస్ట్ కి గురయ్యారు. తాజాగా ఇప్పుడు సింగపూర్ లో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది.
సీఏఏ కి వ్యతిరేకంగా సింగపూర్ లో నిరసనలు తెలిపిన ఓ భారతీయుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతను అల్లర్లు చేయలేదు, గొడవలు చేయలేదు, మెరీనా బె సాండ్స్ హోటల్ సమీపంలో ఫ్లకార్డ్ పట్టుకుని నిరసనలు తెలపడంతో పాటు ప్లకార్ట్ పట్టుకొని ఫోటో దిగి సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటో కాస్తా వైరల్ అవ్వడంతో పోస్టుని డిలీట్ చేశాడు. కానీ
ముందునుంచి అతని కదలికలపై దృష్టి పెట్టిన సింగపూర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఎలాంటి గొడవలు చేయకపోయినా ఇలాంటి అనుమతి లేని నిరసనలు, సభలు పెట్టడం సింగపూర్ చట్టాల రీత్యా నేరమని అందుకే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇతర దేశ రాజకీయ సంబధిత విషయాలు పై ఇక్కడ నిరసనలు తెలియచేయటం సింగపూర్ చట్టాల ప్రకారం నేరమని తెలిపారు పోలీసులు