కెసిఆర్ విజన్ తోనే సింగరేణి అభివృద్ధి – ఎమ్మెల్యే బాల్క సుమన్

-

కేసీఆర్ విజన్ తోనే సింగరేణి అభివృద్ధి చెందుతున్నదని అన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. సింగరేణి లాభాల్లో 30 శాతం వాటాను కార్మికులకు అందిస్తున్నారని కొనియాడారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. మోడీ సర్కార్ ఇప్పటికయిన మేల్కొనండి అన్నారు. ఒకరిద్దరు పెద్ద మనుషుల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి రావాలని కోరుతున్నామన్నారు బాల్క సుమన్. కెసిఆర్ నాయకత్వం దేశానికి అవసరం అన్నారు. అలాగే టిఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి సహకరించడం లేదన్నారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. కేంద్రం కుట్రతో సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటుందన్నారు.

కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి రైల్వే లైన్ కోసం సింగరేణి నిధులు ఇస్తే కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. కిషన్ రెడ్డి కేంద్రం దగ్గర మోకరిల్లి …రాష్ట్రంకు నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు లో ఓటు అడిగే హక్కు బిజెపికి ఉందా ? అని ప్రశ్నించారు. బిజెపి రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version