సీఎం స్టాలిన్ పై సింగర్ చిన్మయి విమర్శలు..

-

గతంలో శ్రీరెడ్డి చేసిన నిరసన వలన మీటు ఉద్యమం మొదలైంది, ఇందులో భాగంగా చాలామంది సినీ ఇండస్ట్రీ లో పాత్ర ఉన్న మహిళలు తమకు జరిగిన అన్యాయాలను చెప్పుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ప్రముఖ సింగర్ చిన్మయి తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి కూడా ప్రేక్షకులతో పంచుకుంది. తమిళనాడులోని ప్రముఖ పాటల రచయిత మరియు కవి వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని ఎప్పటినుంచో మొత్తుకుంటోంది. కానీ ఎవ్వరూ ఈమెను అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక తాజాగా సీఎం స్టాలిన్ వైరముత్తు పుట్టినరోజు కావడం వలన ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పడంతో, మళ్ళీ చిన్మయి ఈ విషయాన్నీ బయటకు తెచ్చింది. పొలిటికల్ లీడర్స్ అందరూ మహిళల భద్రత గురించి గొప్ప గొప్ప మాట్లాడు చెబుతారు. కానీ సమస్య ముందు ఉంటే మాత్రం పరిష్కరించే దైర్యం చేయరు అంటూ వ్యాఖ్యలు చేసింది.

ఇప్పుడు వైరముత్తును ఎవ్వరూ ఎందుకు ప్రశ్నించడం లేదంటూ స్టాలిన్ కు తగిలేలా మాట్లాడింది. ఇలాంటి వారికి రాజకీయ నాయకులే అండగా ఉంటూ వస్తున్నారని ఆరోపించింది. మరి ఈ విషయంపై స్టాలిన్ ఏమైనా స్పందిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news