ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతితో సినీ ప్రపంచం విశాధంలోకి వెళ్లిపోయింది. దేశంలోని అన్ని సినీ పరిశ్రమలు కూడా ఆయనకు ఘనంగా నివాళి అర్పిస్తున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నేమరవేసుకున్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అందరూ ట్విట్టర్ లో ఈ మేరకు ట్వీట్ లు చేసారు. తాజాగా సింగర్ సునీత కూడా ట్వీట్ చేసారు.
నా ఛిద్రమైన జీవితం లో వెలుగులు నింపిన వ్యక్తి. నాకు పాట మీద ప్రేమ కలిగించి, పాడాలనే తపన పెంచి, నా బాగోగులు గమనిస్తూ నాకు బాసటగా నిలుస్తూ జీవితం మీద మమకారం పెంచిన వ్యక్తి నా ఆత్మ బంధువు. నా మావయ్య. భౌతికంగా లేరు అంతే. అంటూ తనతో ఎస్పీ దిగిన చిత్రాన్ని ఆమె పోస్ట్ చేసారు.