ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది.. జుట్టుకు అయితే ఇంకా మేలు చేస్తుంది. ఈ సీజన్‌లో ఉసిరికాయలు బాగా వస్తాయి.. అందరూ ఇప్పుడూ ఉసిరితో పచ్చళ్లు పట్టుకుంటారు. పచ్చళ్లకంటే ఉసిరితో మిఠాయిలు చేసుకుంటే.. ఇంకా బెటర్.. ఉసిరిలో శరీరానికి కావాల్సిన ఫైబర్, ఫోలేట్, యాంటీ-ఆక్సిడెంట్లు, ఫాస్పరస్, ఐరన్, పిండి పదార్థాలు, ఒమేగా 3, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి.
అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఉసిరి తీసుకోవడం మంచిది.. ఉసిరి ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీర నిర్విషీకరణకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఉసిరి తినడం వల్ల జీవక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిని ప్రతి రోజూ శీతాకాలంలో తినడం వల్ల శరీరాన్ని సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. రోజు ఉసిరికాయ పచ్చడి తింటే మళ్లీ వేడి చేస్తుంది.. అందుకే ఉసిరిని మిఠాయిలా చేసుుకని రోజు కొంచెం అలా నోట్లో వేసుకుంటే సరి.! ఉసిరి మిఠాయి ఎలా చేయాలో చూద్దామా..!
ఉసిరి మిఠాయి చేయడానికి కావలసిన పదార్థాలు:
జీలకర్ర 1.5 tsp
పొడి చక్కెర 1.5 tsp
ఉసిరి 2 కిలోల
చక్కెర 1.5 kg
చాట్ మసాలా 1.5 tsp
ఉసిరి మిఠాయి ఎలా తయారు చేయాలి?
ఉసిరికాయ మిఠాయి చేయడానికి.. ముందుగా ఉసిరికాయను కడిగి శుభ్రం చేయండి. తర్వాత కుక్కర్‌లో వేసి 1 విజిల్ వచ్చే వరకూ ఉడికించాలి.
దీని తర్వాత మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దానిలో పంచదార చల్లి పొడి గుడ్డతో కప్పాలి. దానిని కనీసం ఒకటి లేదా రెండు రోజులు గుడ్డతో కప్పి ఉంచండి. అప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో ఆరబెట్టండి. ఆ తర్వాత జీలకర్ర, పొడి చక్కెర, చాట్ మసాలా వేసి కలిపి మిఠాయిల్లా నిల్వ చేసుకోవచ్చు.
ఉసిరితో మిఠాయి మాత్రమే కాదు.. ఆయిల్ కూడా చేసుకోవచ్చు..ఉసిరికాయల్లో గింజలు తీసేసి పేస్ట్ చేసి మీరు వాడాలనుకున్న ఆయిల్‌లో ఇది వేసి ఒక పది పదిహేను రోజులపాటు అలానే వదిలేయండి. ఆ తర్వాత ఆయిల్‌ను ఫిల్టర్ చేసి వాడుకోవడమే.. ఇలా చేసిన ఆయిల్ రాసుకోవడం వల్ల జుట్టు రాలదు. ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా ఉండదు.!