కంప్యూట‌ర్ ముందు కూర్చుంటున్నారా.. క‌ళ్లు జ‌ర భ‌ద్రం..!

-

ప్రస్తుత స‌మాజంలో కంప్యూటర్‌ వాడకం చాలా ఎక్కువ అయిపోయింది. పెద్దలు ఆఫీసు కార్యకలాపాలలోనూ, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో చాటింగ్‌ చేయడానికి ఉప‌యోగిస్తే.. పిల్లలు ఆటల కోసం కంప్యూటర్‌ను లేదా ఫోన్‌నో ఉపయోగిస్తున్నారు. కంప్యూట‌ర్‌ను అతిగా వాడ‌డం వ‌ల్ల అనేక రకాల‌ సమస్యల‌తో బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది. అందులో ముఖ్యమైన సమస్య కళ్ళు దెబ్బతినడం. కళ్ళు మానవ శరీరంలో అత్యంత ప్రముఖ పాత్రను వహిస్తాయి.


అయితే ఎక్కువ‌గా  కంప్యూటర్‌ ముందు పనిచేస్తూ కూర్చునే వారికి కంటికి సంబంధించి పలు రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. కళ్ల నుండి నీరు రావడం, వేడిగా అనిపించడం, కళ్లు మంట, నల్లని వలయాలు వంటి సమస్యలు వస్తుంటాయి. కంప్యూటర్‌ ముందు కూర్చున్నప్పుడు కళ్ళు ఒత్తిడికి గురికావడం అతి స‌హ‌జం. అటువంటి సమయాల్లో  చ‌ల్ల‌టి వాట‌ర్‌తో కళ్ల‌ను శుభ్రం చేసుకోవ‌డ‌మో లేదా ప్రతి రెండు నిముషాలకొకసారి కళ్లను సున్నితంగా ఒత్తుకోవ‌డ‌యో చేయాలి. దీంతో అలసట పొందిన కళ్లు కాస్త విశ్రాంతి తీసుకుంటాయి.

వాస్త‌వానికి కంప్యూటర్‌ ముందు నిత్యం కూర్చుని ఉండటం వల్ల కంటి నుంచి నీళ్ళు కారడం మొదలవుతుంది. తర్వాత పొడిబారతాయి. అలాంట‌ప్పుడు దూదిని కొబ్బరి నూనెలో ముంచి కళ్లు మూసి కనురెప్పలపై ఆ దూదిని ఉండాలి లేదా క‌మ‌లాపండు ర‌సంలో కొద్దిగా పాలు క‌లిపి బాగా మిక్స్ చేసి క‌ళ్ల కింద సున్నితంగా మ‌సాజ్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్లు మంట‌లు త‌గ్గుతాయి. అలాగే  అలోవెరను క‌ళ్లు మూసి క‌నురెప్ప‌ల‌పై రుసుకుంటే క‌ళ్లు పొడి బార‌కుండా ఉంటాయి. ఇలా కంప్యూట‌ర్ ముందు కూర్చునేవారు కంటి జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌ని స‌రిగా తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version