భారతదేశంలో మాత్రమే ఉండే ఆరు అరుదైన జంతువులు గురించి తెలుసుకోవాల్సిందే…!

-

మన భారతదేశం వన్యప్రాణుల అభయారణ్యం లో ఎన్నో రకాల అందమైన జంతువులు, ఎన్నో స్పెషల్ జాతులు నివసిస్తూ ఉంటాయి. వన్యప్రాణులు భూమి మీద ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి సైంటిఫిక్ గా అవి పర్యావరణాన్ని సమతుల్యం చేస్తుంది. అరుదైన అందమైన మరియు అంతుచిక్కని జంతువులకు ఇది నిలయంగా వుంది. అయితే మన దేశంలో మాత్రమే కనిపించే ఈ అరుదైన జాతులు గురించి, అవి మన దేశం లో ఎక్కడ చూడచ్చు అనే వాటి కోసం ఇప్పుడు చూద్దాం.

1. Lion-tailed macaque

కేరళ లో వుండే Shendurney Wildlife Sanctuary లో మనకి ఇవి కనపడతాయి. తప్పకుండా ఈ అభయారణ్యాన్ని చూడాలసిందే. ఇక్కడ అనేక రకాల అంతరించిపోతున్న జంతువుల్ని ఉంచుతారు. దీని విస్తీర్ణం 172.403 sq.km. మీరు ఇక్కడికి వెళ్తే మీరు అడవులు లోపల ఉండచ్చు. అక్కడ మీరు క్యాంపింగ్ హౌసెస్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పైగా జంగిల్ ట్రాకింగ్ కూడా చేయొచ్చు.

2 . Nilgiri marten

తమిళ్ నాడు లో అన్నామలై టైగర్ రిజర్వు లో Nilgiri marten ని మనం చూడొచ్చు. ఇవి పశ్చిమ కనుమల యొక్క తేమ మరియు తడి సతత హరిత అడవుల లో కనిపిస్తాయి, ఇవి 150-2200 మీటర్ల ఎత్తు లో నివసిస్తాయి. డార్క్ బ్రౌన్ కలర్ లో ఇవి ఉంటాయి. ఒంటి మీద పసుపు రంగు పాచ్ తో ఉంటుంది. వీటి పేరు నీలగిరి కొండల నుండి వచ్చింది.

3.The Kashmir Stag:

The Kashmir Stag ని చూడాలంటె జమ్మూ & కాశ్మీర్ Dachigam National Park కి వెళ్లాల్సిందే. శ్రీనగర్ నుండి 22 కిలో మీటర్ల దూరం లో ఉన్న డాచిగం నేషనల్ పార్క్ యొక్క దట్టమైన నదీ అడవుల లో మాత్రమే కనబడుతుంది, కాశ్మీర్ స్టాగ్ ప్రమాదకరమైన మరియు అరుదైన జాతుల లో ఇది ఒకటి.

4. Sangai:

మణిపూర్ లో Keibul Lamjao National Park లో ఈ జాతి జంతువులు మనకి కనిపిస్తాయి. ఈ జంతువులు 15-20 కిలోమీటర్ల ప్రాంతంలో నివసిస్తాయి , ఇది ప్రపంచం లోని ఏకైక ఫ్లోటింగ్ పార్క్. కనుక చూడడానికి కూడా చాల బాగుంటుంది కదా..!

5. Pygmy Hog:

ఇవి మానస్ నేషనల్ పార్క్ అస్సాం లో వున్నాయి. ఇవి చిన్న చిన్న అడవి పందులు. ఇప్పుడు కేవలం వీటిలో 150 మాత్రమే వున్నాయి.

6. Nilgiri Tahr

కేరళ లో Eravikulam National Park లో ఈ జాతి జంతువులని మనం చూడచ్చు. సుమారుగా 700 నుండి 800 ఇక్కడ వున్నాయి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news