గోల్డ్ బిస్కెట్ ల పేరుతో మోసం చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్ అయింది. తక్కువ రేటుకే ఇస్తామంటూ నకిలీ బంగారంతో మోసం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం ఐదుగ్గురు సభ్యుల మూఠా కాకాగా ఆ ముఠాకు చెందిన నలుగురు సభ్యులను అరెస్ట్ చేసిన ఎస్వోటీ శంషాబాద్ పోలీసులు 5.8 కేజీల నకిలీ బంగారు బిస్కెట్స్, ఎనిది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కీలక నిందితుడు సయ్యద్ దస్తగిరి అహ్మద్ తాంత్రికుడు అని నకిలీ వైద్యుడుగా కూడా చెలామణి అవుతున్నాడని గుర్తించారు.
అబ్ధుల్ ఫయీమ్, షేక్ ఫయాజ్ , అలీ అక్బర్ తయ్యబ్, మిర్జా అబ్బాస్ అలీ సాధీజ్ ఈ కేసులో నిందితులుగా గుర్తించారు. ఇంట్లో బంగారం ఉంది తీయాలని నమ్మించి మోసం చేశారాని. ఫేక్ గోల్డ్ బిస్కెట్స్ ఇంట్లో పాతిపెట్టి వెలికి తీసినట్టు మోసం చేశారని పోలీసులు గుర్తించారు. ఈ ఫేక్ బంగారాన్ని అమ్మడానికి ప్రయత్నించిన నిందితులు పట్టుబడ్డారు. తక్కువ రేటుకు బంగారం ఇస్తామంటే నమ్మోద్దని పోలీసులు చెబుతున్నారు. పూజలు, మంత్రాల పేరుతో మోసం చేస్తున్నారు జాగ్రత్త అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.