ఆదివారం రోజున ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్యన ఆసియా కప్ ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సారధ్యంలోని ఇండియా జట్టు ఏకంగా పది వికెట్ల తేడాతో మ్యాచ్ ను గెలిచి టైటిల్ ను గెలుచుకుంది. కాగా తాజాగా శ్రీలంక SJB పార్టీ అట్టనాయకే కొత్త సందేహాన్ని ముందుకు వచ్చారు. అదేంటి.. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక టక్కున ఓడిపోయింది. కనీసం పోటీ అయినా ఇస్తుంది అనుకుంటే చాలా ఘోరంగా ఓడిపోయింది అంటూ సందేహన్ని వెలిబుచ్చారు అట్టనాయకే. కొన్ని గంటల లోనే మ్యాచ్ ముగియడాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా అంటూ ఈయన ప్రశ్నించారు. మ్యాచ్ జరిగిన రోజున ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు కావడం వలన ఇండియాకు గిఫ్ట్ ఇవ్వడానికి శ్రీలంక దారుణంగా ఓడిపోయిందా అంటూ ఈయన కామెంట్స్ చేశారు. శ్రీలంక ఇంత దారుణంగా ఓడిపోవడంతో రాజకీయ ప్రమేయం ఏమైనా ఉందా ? తక్షణమే ఈ ఓటమిపై విచారణ చేపట్టాలి అంటూ డిమాండ్ చేశారు అట్టనాయకే.
కాగా ఈయన చేసిన ఈ వ్యాఖ్యల పట్ల శ్రీలంక క్రికెట్ ఏమైనా స్పందిస్తుందా చూడాలి. కాగా ఈ మ్యాచ్ లో శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆల్ అవుట్ అవ్వడం బాధాకరం.