పొట్లకాయ రసం ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. చర్మ సంరక్షణలో ప్రముఖ పాత్ర వహించే పొట్లకాయ, ముడుతలను తగ్గిస్తుంది. దుమ్ము, కాలుష్యం, నూనె వలన కలిగే ఇబ్బందులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనికొరకు పొట్లకాయ రసం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. రోజూ పొద్దున్న పూట పొట్లకాయ రసం తాగితే చర్మ సంరక్షణను పొందవచ్చని తెలుసుకోండి.
ముడుతలు తగ్గుతాయి
విటమిన్ సి తో పాటు అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీవనశైలి విధానాల వల్ల కలిగే అకాల ముడుతలను ఇది తగ్గిస్తుంది. అంతేకాదు చర్మంపై ఏర్పడే గీతలను దూరం చేసి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
మెరుస్తున్న చర్మానికి
యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు ఇంకా విటమిన్లు పొట్లకాయ రసంలో ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అంతే కాదు చర్మాన్ని చైతన్యవంతం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది.
కళ్ళవాపు తగ్గడానికి
పొట్లకాయ ముక్కలను కళ్ళ మీద ఉంచితే కళ్ళవాపు తగ్గుతుంది. మంచి ఉపశమనాన్ని అందించడంతో పాటు చల్లదనం కూడా.
మొటిమల నియంత్రణకి
జిడ్డు చర్మం ఉన్నవారిలో మొటిమలు ఎక్కువగా కనిపిస్తాయి. పొట్లకాయ రసం, చర్మంపై అధిక జిడ్డును కలిగించకుండా ఉంచుతుంది. దీనివల్ల మొటిమలు తగ్గుతాయి. ఇంకా, పొట్లకాయ రసాన్ని మొటిమల రాసుకున్నా మంచి ప్రభావం ఉంటుంది.
బట్టతల నివారణలో
బట్టతల ప్రాంతంలో పొట్లకాయ రసాన్ని రాయండి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తూ ఉంటే వెంట్రుకలు వచ్చే అవకాశం ఉంది. వారానికి రెండు రోజుల పాటు పొట్లకాయ రసాన్ని తలపై రాసుకుని కొద్ది సేపయ్యాక నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది.