11వ రోజుకు చేరిన ఆపరేషన్‌..భయంకరంగా SLBC టన్నెల్ లేటెస్ట్‌ వీడియో !

-

SLBC టన్నెల్ సహాయక చర్యల ఆపరేషన్స్ వీడియో వైరల్‌ గా మారింది. నేటితో SLBC టన్నెల్ సహాయక చర్యల ఆపరేషన్స్…11వ రోజుకు చేరుకున్నాయి. GPR సాంకేతిక పరికరం ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. నీరు, బురద, రాళ్ళను తొలగిస్తోంది రెస్క్యూ సిబ్బంది.

SLBC tunnel relief operations reach 11th day

టన్నెల్ బోరింగ్ మెషీన్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేస్తోంది సిబ్బంది. 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియని పరిస్థితి నెలకొంది. కాగా, SLBC టెన్నెల్ 8 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం.తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన రాజకీయ ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. పదేళ్ల పాటు అధకారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ సకాలంలో ప్రాజెక్ట్ ని పూర్తి చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందంటూ అధికార పక్షం ఆరోపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఇంతటి ఘోరం జరిగిందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ అనే సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news