SLBC టన్నెల్ ప్రమాదం సంభవించి ఇవాళ్టితో ఆరు రోజులు కావొస్తుంది. అయినప్పటికీ టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మంది ఆచూకీ మాత్రం ఇంతవరకు దొరకలేదు.దీంతో వారంతా చనిపోయి ఉంటారని ఇంజినీర్లు, సహాయక చర్యలు నిర్వహిస్తున్న సిబ్బంది సైతం భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్,ఆర్మీ, హైడ్రా బృందాలు ఎంత ప్రయత్నించినా వారిని కాపాడే ప్రయత్నం చేయలేకపోయాయి.
ఎందుకంటే టన్నెల్ 13.5 కిమీ మీద్ద 200 మీటర్ల బుదర టన్నెల్ పూర్తి స్థాయి ఎత్తు వరకు పేరుకుని పోయింది. బురద తొలగిస్తున్న కొద్ది పైనుంచి కూలుతున్నట్లు సమాచారం. నీళ్లు కూడా పైనుంచి లీక్ అవుతున్నాయి.వాటర్ లెవల్ పెరిగిపోతుండటం సహాయక చర్యలకు అడ్డంగికిగా మారింది. అంతేకాకుండా, టన్నెల్ డ్రిల్ చేస్తున్న బోర్‌వెల్ మిషన్ విరిగిపడటంతో యంత్రాల శిథిలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మొత్తం చీకటిగా ఉండటంతో ప్రస్తుతం మార్కోస్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి.
TeluguScribe Exclusive
SLBC టన్నెల్ ప్రమాద సంఘటన లేటెస్ట్ విజువల్స్
1/2 pic.twitter.com/g9FFW5TAgT
— Telugu Scribe (@TeluguScribe) February 27, 2025