కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో తాము ఎప్పుడూ కట్టుబాట్లు దాటలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఫ్యామిలీలోని ప్రజాప్రతినిధులు అందరూ డిసిప్లిన్‌తో ఉన్నారని, కట్టుబాట్లను ఫాలో అయ్యారని చెప్పారు.
గురువారం ఉదయం తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలిసి వచ్చాక కొడంగల్ నియోజకవర్గానికి మా అన్న తిరుపతి రెడ్డినే చూసుకుంటాడని పేర్కొనడం ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. ప్రజలు ఎన్నికల్లో ఎన్నుకోని వ్యక్తి.. కనీసం నామినేటెడ్ పోస్టు కూడా లేని తిరుపతి రెడ్డికి కలెక్టర్ వెళ్లి స్వాగతం పలకడం, బుగ్గ కారులో ఆయన తిరగడం ఇవన్నీ అధికార దుర్వినియోగానికి పాల్పడటం కాదా? అని కవిత సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్ బ్రదర్స్ అందరూ ఇలాగే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వివరించారు. బీఆర్ఎస్ ఫ్యామిలీలో అందరూ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అధికారంలో భాగమయ్యామని గుర్తుచేశారు.