సుప్రీం కోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట

-

సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పై సుప్రీం కోర్టులో  మోహన్ బాబుకు స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు మోహన్ బాబు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాలకు కేసు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా..? అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.

నష్టపరిహారం కావాలా..? జైలుకు పంపాలా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ప్రతివాదులు దాఖలు చేసే కౌంటర్లో అన్ని విషయాలు స్పష్టం చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణలో జడ్జిమెంట్ ఇస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం.సినీ నటుడు మోహన్ బాబు తరఫున వాదన వినిపించారు సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి. తన కొడుకుతో గొడవల సందర్భంగా ఈ ఘటన జరిగింది. జర్నలిస్ట్ పై జరిగిన దాడికి బహిరంగంగా క్షమాపణ చెప్పాను. నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను. 76 ఏళ్ల వయసున్న తాను కావాలని దాడి చేయలేదు.ఆవేశంలో జరిగింది. జర్నలిస్టులు నా ఇంట్లోకి ట్రెస్ పాస్ చేశారని తెలిపారు.

మరోవైపు జర్నలిస్ట్ ఈ విధంగా పేర్కొన్నాడు.  తన పై దాడి చేశాడు. ఐదు రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నాను. తనకు సర్జరీ జరిగింది. నెల రోజులుగా పైపు ద్వారానే ఫుడ్ తీసుకుంటున్నాను.. దాడి చేయడం కాకుండా కించపరిచాడు. ప్రొఫెషనల్ గా నష్టం జరిగింది. నా కెరీర్ ను నష్టపోయాను అని వివరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news