తిరుపతిలో బుధవారం రాత్రి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తాజాగా స్పందించారు. తిరుపతిలో భక్తుల మరణం పట్ల సీపీఐ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. తొక్కిసలాట ఘటనలో పోలీస్ వైఫల్యం, టీటీడీ సమన్వయలోపం బహిర్గతమవుతుందని తెలిపారు.
ఈ ఘటనలో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి స్థానిక సీపీఐ కార్యకర్తలు సహాయ సహాకారాలు అందించాలని ఈ సందర్భంగా నారాయణ పిలుపునిచ్చారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని మృతులకు నష్టపరిహారం, గాయపడిన వారికి వైద్య సాయం అందించాలని కోరారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడిని సీపీఐ పార్టీ తరఫున కోరుతున్నట్లు తెలిపారు.