పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన అదిరే లాభాలని పొందొచ్చు. పైగా పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు పెట్టడం వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. చక్కగా ఈ స్కీమ్ లో డబ్బులని పెట్టి మంచిగా రాబడిని తీసుకొచ్చు. అందుకే చాలా మంది స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు పెడుతూ ఉంటారు.
అయితే పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. దీనిలో చేరితే ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. లేదంటే మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున కూడా డబ్బులు పొందొచ్చు.
ముందుగానే ఒకేసారి డబ్బులు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ఇందులో డబ్బులు పెడితే మీరు ఐదేళ్ల వరకు ఆగాల్సిందే. ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ప్రతి నెలా వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ లో రూ.1000 నుంచి డబ్బులు పెట్టొచ్చు.
గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ జాయింట్ అకౌంట్ తెరిస్తే రూ.9 లక్షల వరకు డబ్బులు దాచుకోవచ్చు. భార్యాభర్తలిద్దరూ ఈ పథకంలో చేరితే జాయింట్ అకౌంట్ం తెరవాలి. రూ.9 లక్షలు ఒకేసారి డిపాజిట్ చేసేయాలి. ఇలా చేస్తే ఇద్దరికీ కలిపి ప్రతి ఏటా రూ.60 వేల వరకు లభిస్తాయి. అంటే నెలకు దాదాపు రూ.5 వేల వరకు వస్తాయి.