ప్ర‌పంచంలోనే అతి చిన్న ల్యాప్‌టాప్.. ఎప్పుడైనా చూశారా..?

-

ఒకప్పుడు కేవలం కంప్యూటర్లు మాత్రమే ఉండేవి. ఎవరి దగ్గరైనా కంప్యూటర్ ఉంది అంటే అదో పెద్ద గొప్పగా భావించేవారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా లాప్టాప్ లే దర్శనమిస్తున్నాయి. కంప్యూటర్ కొంటే ఇంట్లోనే ఉండి పని చేసుకోవాల్సి వస్తుంది అదే లాప్టాప్ అయితే మనం ఎక్కడికి వెళ్ళినా మన వెంటే తీసుకుపోవచ్చు. ఇక టెక్నాలజీకి అనుగుణంగానే అన్ని వస్తువులు తయారవుతున్నాయి. చైనాకు చెందిన మ్యాజిక్‌ బెన్‌ సంస్థ సరికొత్త ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ను తయారుచేసింది. మ్యాగ్1 పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ ప్రపంచంలోనే అతి చిన్నది కావడం విశేషం.

దాదాపు A5 కాగితమంత పరిమాణంలో ఉండే ఈ ల్యాప్‌టాప్‌ బరువు కేవలం 700 గ్రాములు. అయినప్పటికీ యాపిల్‌ ల్యాప్‌టాప్‌, మ్యాక్‌బుక్‌ కంటే ఎక్కువ పోర్టులు ఇందులో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ అల్ట్రా పోర్టబుల్ లాప్టాప్ లో టచ్ ప్యాడ్ తో పాటు యూఎస్‌బీ 3.0 పోర్ట్‌, టైప్‌ సీ కనెక్టర్‌, మైక్రోఎస్‌డీ కార్డ్‌ రీడర్‌, ఆడియో సాకెట్‌, మైక్రో హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు ఇందులో ఉన్నాయి. దీని డిస్‌ప్లే టచ్‌ స్క్రీన్‌ కావడం మరో ప్రత్యేకత. దీని ధర 790 డాలర్లుగా ప్రకటించారు. ఇర పేరుకు అత్యంత చిన్న ల్యాప్‌టాప్‌ అయినప్పటికీ.. మ్యాగ్‌1 30ఏహెచ్‌ఆర్‌ బ్యాటరీ సామర్థ్యం కలదని కంపెనీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version