ఏపీ ప్రజలకు షాక్..గృహ విద్యుత్ వినియోగానికి స్మార్ట్ మీటర్లు

-

ఏపీ ప్రజలకు షాక్. ఏపీలో గృహ విద్యుత్ వినియోగానికి స్మార్ట్ మీటర్లు పెట్టనున్నారు. గృహ వినియోగం సహా కమర్షియల్, ఇండస్ట్రీయల్, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ విద్యుత్ స్మార్ట్ మీటర్లను అమర్చనుంది ఏపీ సర్కార్. రెండు దశల్లో ఇళ్లకూ విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపునకు చర్యలు తీసుకోనున్నారు. 200 యూనిట్ల విద్యుత్ వినియోగం దాటే ఇళ్లకే స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్‌. మొత్తంగా 18.73 లక్షల గృహ విద్యుత్ వినియోగ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల పెట్టనుంది ప్రభుత్వం.

తొలి విడతలో సుమారు 4.70 లక్షలు.. రెండో విడతలో 14 లక్షలకు పైగా కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు ఇంధన శాఖ అధికారులు. కేంద్ర ప్రభుత్వ ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద ఇళ్లల్లోని విద్యుత్ మీటర్లకు స్మార్ట్ మీటర్ల బిగించనున్నారు. పంచాయతీ కార్యాలయాలకూ స్మార్ట్ మీటర్లను బిగించనున్న ఏపీ ఇంధన శాఖ… వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల బిగింపు అంశంపై ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు పంపింది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల నుంచి వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ చేపట్టనుంది ఇంధన శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news