ప్రతీ మనిషికి ఉండేది 24 గంటలే. ఈ సమయంలో కొంతమంది ఎంతో పని చేస్తారు. ఇంకొంతమంది అసలేమీ చేయలేరు. వాళ్లు చేయడానికి, వీళ్ళు చేయలేకపోవడానికి కారణం టైం మేనేజ్మెంట్ తెలియక పోవడమే.
నీకున్న 24 గంటలను నీవు ఎలా వాడుకుంటావు అన్నదే ముఖ్యం. టైం ని సరిగ్గా వాడుకోవడానికి కొన్ని టెక్నిక్స్ అవసరం అవుతాయి. ప్రస్తుతం మనం బుల్లెట్ జర్నలింగ్ అనే టెక్నిక్ గురించీ, దాన్ని ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోవడం గురించీ తెలుసుకుందాం.
రోజువారి పనుల లిస్ట్:
ఉదయం లేవగానే ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారో బుల్లెట్ పాయింట్స్ రూపంలో రాసుకోండి. మీరు రాసుకున్న పనులను కచ్చితంగా చేయాలి. అందుకే చేయదగిన పనులను మాత్రమే రాయండి.
టైం తీసుకునే పనులకు ప్రత్యేక చార్ట్:
కొన్ని పనులు ఒక రోజులో పూర్తి కావు. వాటికోసం మీరు వారం రోజులు తీసుకున్నారు అనుకుందాం. ఆ పని పేరు ఆ పక్కన దానికి కేటాయించిన సమయాన్ని రాయండి. రోజూ ఉదయం లేవగానే ఆ చార్ట్ ని చూడండి. దానివల్ల మీరు చేస్తున్న పని ఎంతవరకు వచ్చిందో మీకు అర్థం అవుతుంది.
టైం వేస్ట్ చేసే పనులకు సమయం కేటాయింపు:
ఒక రోజులో పూర్తి సమయాన్ని ప్రోడక్టివిటీగా ఎవ్వరూ మార్చలేరు. ఎంతో కొంత సమయాన్ని వృధా చేస్తుంటారు. ఆ వృధా సమయం ఎంత తక్కువ అయితే అంత మంచిది. అలా జరగాలి అంటే.. ఒక రోజులో దానికంటూ ప్రత్యేక సమయాన్ని కేటాయించండి. కేవలం ఆ సమయంలో మాత్రమే టైం వేస్ట్ చేయండి.
ఒక పని చేసేటప్పుడు ఆ పని మాత్రమే చేయండి:
మార్నింగ్ లేవగానే ఎక్సర్ సైజ్ చేయాలనుకున్నారు. ఆ టైంలో ఎక్సర్సైజ్ చేయండి, అంతేకానీ.. ఫోన్ చూస్తూ కూర్చోకండి. దీనివల్ల ఏ టైం కి జరగాల్సిన పని ఆ టైంకి జరిగిపోతుంది.
వారం వారం రివ్యూ చేయండి:
ఒక వారంలో మీరు ఏమేం పనులు చేశారో, దానిలో ఇంపార్టెంట్ ఎన్ని ఉన్నాయో, అవసరం లేనివి ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుంటే మీరు ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది. దానివల్ల భవిష్యత్తులో మీ ప్రోడక్టివిటీ పెరుగుతుంది.