Sneha: వాట్స్ ది సీక్రెట్ స్నేహ..వయసు తగ్గించుకున్న నటి..కుర్ర హీరోయిన్స్‌తో పోటీ

-

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్యూట్ స్మైల్ తో పాటు తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన సీనియర్ హీరోయిన్ స్నేహ..హోమ్లీ బ్యూటీగా బాగా ఫేమస్. దాదాపుగా తెలుగుతో పాటు ఇతర భాషలలో టాప్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది ఈ నటి.

ప్రసన్నను మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే, ఇటీవల కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి..మళ్లీ తన సత్తా ఏంటో చూపే ప్రయత్నం చేస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ వన్నె తగ్గని అందం ఆమె సొంతం అన్నట్లుగా స్నేహ వెరీ యంగ్ గా కనిపిస్తుండటం విశేషం అని చెప్పొచ్చు.

ఎప్పుడూ సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో కనిపించే తాజాగా రూటు మార్చింది. ట్రెండీ వేర్ లో దిగిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. బ్రౌన్ కలర్ షార్ట్ టాప్ లో అలా చూస్తూ నవ్వుతూ దిగిన ఫొటో లు షేర్ చేసింది. సదరు ఫొటోలు చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు.

కుర్ర హీరోయిన్స్ తో పోటీకి రెడీ గా స్నేహ వస్తోందని అంటున్నారు. వయసు తగ్గించుకుంది స్నేహ..సీనియర్ హీరోయిన్ గ్లామర్ సీక్రెట్ ఏంటో? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం స్నేహ ‘విదియాల్, మ నాన్న పోలీస్’ చిత్రాల్లో నటిస్తోంది. స్నేహ…తెలుగు ప్రేక్షకులకు చివరగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ పిక్చర్ లో కనిపించింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version