ఎన్టీఆర్ ట్వీట్ పై ఫైర్, నీకు మేము గుర్తులేమా…?

-

అమరావతి విషయంలో సిని హీరోలు మాట్లాడితే ఒక ఇబ్బంది మాట్లాడకపోతే మరో ఇబ్బందిగా మారింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ రైతులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిగా ఉంచాలి అనే ఉద్యమం ఇప్పుడు నిదానంగా మిగిలిన జిల్లాలకు కూడా పాకుతుంది.

ఈ నేపధ్యంలో ఈ విషయం గురించి సిని హీరోలు స్పందించకపోవడంపై ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ కి అమరావతి సెగ తగలగా, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఈ సెగ తగిలింది. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా ఆదివారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ అల్లు అర్జున్ ని పొగుడుతూ ట్వీట్ చేసారు.

దీనిపై అమరావతి జన౦ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మీ సొంత జిల్లాలో కూడా ఉద్యమం జరుగుతుంది కదా ఎన్టీఆర్ గారూ, మీరు ఎందుకు దానిపై స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ సినిమాలు మేము ఇక చూసేది లేదని కొందరు అంటే, మీకు నొప్పి వస్తే మాట్లాడతారని, అలాంటిది జనానికి వస్తే మీకు కష్టంలా ఉండదని, మీ అన్నయ్య సినిమా చూడాలని అల్లు అర్జున్ ని పొగిడారు. మరి అమరావతి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version