కాస్టింగ్ కౌచ్ అంశంతో చిన్మయి శ్రీపాద గాయనిగా కంటే ఎక్కువగా పాపులర్ అయింది. బాధితురాళ్ల పక్షాన నిలబడి గట్టిగానే పోరాటం చేసింది. ఆమెకు అండగా సమంత తో పాటు చాలా మంది పేరున్న హీరోయిన్లు నిలబడ్డారు. ఇక నిన్నటి రోజున అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగను వీళ్లంతా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన ముద్దు..రొమాన్స్ గురించి చేసిన కామెంట్ ను తప్పు బడుతూ ఏకేసారు. ఇందులో చిన్మయి ముందుంది. సినిమా అంటే అలా ఉండాలి? అందులో హీరోయిన్లను అలా చూపించకూడదు? అంటూ క్లాసులు పీకింది. ఆమెకు తోడు గా మరోసారి తన పాత స్నేహితులే మద్దతునిచ్చారు. ఇంత వరకూ బాగానే ఉంది.
ఇక తాజాగా చిన్మయి భర్త రాహుల్ రవింద్రన్ దర్శకత్వం వహించిన మన్యధుడు-2 టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోకి ఏ సినిమా చూపిస్తానని అసభ్యంగా ఓ డైలాగు చెప్పింది. అంతేనా గోడకి ఏట వాలుగా వాలి సిగరెట్లు కాలుస్తూ పొగను గుప్పు గప్పుడు మంటూ జనాల మధ్యలోకి వదిలింది. మరి దీన్ని ఏమంటారు? చిన్మయి అంటూ నేటి జనులు కొందరు ట్రోలింగ్ లు మొదలు పెట్టారు. సదీప్ రెడ్డికి క్లాస్ లు పీకడం కాదు. ..ముందు మన ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోవాలని చిన్మపై కౌంటర్లు వేస్తున్నారు. సాధారణంగా తెలుగు సినిమాల్లో హీరోలకే పొగతాగే సన్నివేలుండవు. ఇక హీరోయిన్లు పొగ త్రాగే సీన్లు అనేవి చాలా రేర్. మరీ సీన్ డిమాండ్ చేస్తే తప్ప!
అది అతి కొద్ది మంది దర్శకులు మాత్రమే అలా థింక్ చేస్తారు. అలాంటిది నీ భర్త రెండవ సినిమాకే హీరోయిన్ తో సిగరెట్లు కాల్పిస్తున్నాడు? అదీ సీనియర్ హీరో్యిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో? మరి దీన్నేమనాలి. నీ భర్త గురించి మాట్లాడావా? నీ నోరు మూగబోయిందా? నీ వాడు శ్రీరామ చంద్రుడా? అంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మరి వీటిపై చిన్మయి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.