నటనకు గుడ్ బై చెప్పిన మెగా డాటర్ నిహారిక?

-

సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిహారిక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నటనకు గుడ్ బై చెప్పి నిర్మాతగా మారి.. సినిమాలను నిర్మించాలని భావిస్తోందట.

చాలామంది నటులు తమ కూతళ్లను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురారు. కొడుకులు ఎలాగూ హీరోలు అవుతారు కానీ.. కూతుళ్లు ఎవరూ హీరోయిన్లు కారు. కానీ.. ఆ మూస ధోరణిని పక్కన పెట్టి మరీ.. మెగా డాటర్ నిహారిక సినిమాల్లో నటించింది. వెబ్ సిరీస్ లతో తన సినీ జీవితాన్ని ప్రారంభించి.. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లో నటించింది. కానీ.. తను నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.

దీంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిహారిక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నటనకు గుడ్ బై చెప్పి నిర్మాతగా మారి.. సినిమాలను నిర్మించాలని భావిస్తోందట. తనకు ఇప్పటికే సొంత బ్యానర్ ఉంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై పలు వెబ్ సిరీసలు చేసిన నిహారిక.. అదే బ్యానర్ పై సినిమాలు నిర్మించాలని అనుకుంటోందట. అంతే కాదు… ఆ బ్యానర్ లో తను నిర్మించే తొలి సినిమా మెగా హీరోతోనే ఉంటుందట. మరి.. నిహారిక ప్రొడక్షన్ లో నటించే ఆ మెగా హీరో ఎవరో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version