రీ రిలీజ్ సినిమాలపై అసహనం వ్యక్తం చేస్తున్న సొహైల్.. కారణం..?

-

బిగ్ బాస్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న సయ్యద్ సోహైల్ రియాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన నటించిన చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్.. ఇందులో రూపా కొడువాయుర్ హీరోయిన్ గా నటించింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా శుక్రవారం నాడు థియేటర్లలో విడుదలవగా ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించగా.. మైక్ మూవీస్ బ్యానర్ లో అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల , వెంకట్ అన్నపరెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

సినిమా సక్సెస్ సాధించడంతో తాజాగా మిస్టర్ ప్రెగ్నెంట్ టీం సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో హీరో సోహైల్ మాట్లాడుతూ రీ రిలీజ్ సినిమాలపై అసహనం వ్యక్తం చేశాడు. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకు వచ్చిన ప్రతి రివ్యూలో సోహైల్ బాగా నటించాడని రాశారు. నేనొక నటుడిని అని గుర్తింపు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా సిటీలోని మల్టీప్లెక్స్ కి వెళ్లి సినిమా చూశాను. బయటకి వస్తున్నప్పుడు ప్రేక్షకులు బాగా నటించావు అంటూ హగ్ చేసుకున్నారు. అప్పుడే ఒక మంచి సినిమా చేశామని మనసుకు సంతోషం అనిపించింది. పబ్లిక్ టాక్ కూడా ఎవరు నెగిటివ్ గా చెప్పలేదు. అక్కడే మేము సక్సెస్ అయ్యాము అంటూ తెలిపారు.

రీ రిలీజ్ లపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సొహైల్.. నిర్మాతలు పంపిణీదారులు అలాగే అభిమానులను పాత సినిమాలను రీ రిలీజ్ చేసేటప్పుడు వీకెండ్స్ చేయవద్దని కోరారు. వారాంతంలో పెద్ద సినిమాలను తిరిగి విడుదల చేయవద్దని టాప్ టాలీవుడ్ స్టార్ హీరోల పంపిణీదారులను, అభిమానులను కోరుకున్నారు. దయచేసి వారాంతాల్లో ఎలాంటి సినిమాలను ప్లాన్ చేయకండి.. ఎందుకంటే పెద్ద హీరోలు నటించిన పెద్ద సినిమాల చుట్టూ ఉన్న హైప్ .. చాలా కష్టాల తర్వాత చిన్న సినిమాలు సృష్టించే చిన్న హైప్ ని కూడా నాశనం చేస్తాయి. వీక్ డేస్ లో రీ రిలీజ్ లను ప్లాన్ చేసి.. చిన్న సినిమాల కోసం వీకెండ్స్ వదిలేయమని ప్రతి ఒక్కరిని వినమ్రంగా కోరుకుంటున్నాను అంటూ సొహైల్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news