నిన్న తమిళ నాడు రాష్ట్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ – CDS జనరల్ బిపిన్ రావత్ మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలింది. సుల్లూరు, వెల్లింగ్టన్ మధ్య ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌లో బిపిన్ రావత్‌తో పాటు, ఆయన భార్య మధులిక రావత్, వ్యక్తిగత భద్రతాసిబ్బంది, ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు.
14 మంది ప్రయాణీకుల్లో.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే.. ఈ ఘోర ప్రమాదంలో.. ఐఎఎఫ్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయట పడ్డాడు. ఆయన తీవ్ర గాయాలతో మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. ఈ ఏడాదే శౌర్య చక్ర అవార్డు కూడా అందుకున్నారు. గతేడాది ఎల్ ఏసీ తేజస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఎమర్జీన్సీ సేవ్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ మృత్యుంజయుడి ఆరోగ్యం.. కాస్త విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.