భైంసాలో RSS మార్చ్ కి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

-

బైంసాలో ఆర్ఎస్ఎస్ మార్చ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వయించాలని ఆదేశించింది. కేవలం 500 మంది మాత్రమే ర్యాలీలో పాల్గొనాలని హైకోర్టు సూచించింది. మాస్క్ కు 300 మీటర్లు దూరంలో ర్యాలీ నిర్వయించు కోవచ్చని న్యాయస్థానం సూచించింది. ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేనివారే ర్యాలీలో పాల్గొనాలని హైకోర్టు చెప్పింది.

అలాగే మాస్క్ దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ర్యాలీలో పాల్గొనే వారు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని చెప్పింది. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ర్యాలీకి భైంసా పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇంటెలిజెన్స్ నివేదిక ను హైకోర్టు కు సమర్పించారు జీపీ (ప్రభుత్వ తరుపు న్యాయవాది).

రెండు సంవత్సరాలు క్రితం బైంసా లో జరిగిన మత ఘర్షణలు వలన ప్రాణ నష్టం జరిగిందని జీపీ వివరించింది. బైంసా అత్యంత సున్నిత , సమస్యాత్మకమైన ప్రాంతం అని ప్రభుత్వ తరుపు న్యాయవాది తెలిపారు. ఒక్క స్లోగన్ తో మత విద్వేషాలు చెలారుగుతాయన్నారు జీపీ. అయితే టిప్పు సుల్తాన్ బర్త్ డే ర్యాలీ కు సైతం పోలీసులు అనుమతి ఇచ్చారని పిటిషనర్ వాదనలు వినిపించారు. బైంసా భారత దేశంలోనే ఉందని, వెలెసిన ప్రాంతం కాదని వాదనలు వినిపించారు పిటిషనర్. వాదనలు విన్న న్యాయస్థానం మార్చ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version