పాపం గ్రామాలు… పొలాల్లోకి వెళ్ళిపోతున్నాయి…!

-

కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు ప్రజలు అందరూ కూడా ప్రాణ భయంతో బ్రతికే పరిస్థితి ఏర్పడింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది. మన దేశంలో కరోనా కట్టడి ఇప్పట్లో జరిగే పని కాదనే వాళ్ళు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీనితో ఇప్పుడు గ్రామాల్లో ఉండే వాళ్ళు భయపడుతున్నారు. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది.

ఇప్పటికే గ్రామాలో కరోనా వైరస్ దెబ్బకు తమ గ్రామంలోకి ఎవరూ రాకుండా కంచెలు ఏర్పాటు చేసారు. దాదాపు అన్ని గ్రామాలు కూడా ఇదే విధానం అనుసరిస్తున్నాయి. పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. బండ రాళ్ళు పెట్టి మరీ మా గ్రామంలోకి ఎవరూ రావొద్దని కోరుతున్నారు. ఇక మహారాష్ట్ర సరిహద్దుని పంచుకున్న తెలంగాణా గ్రామాలు అయితే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.

ప్రజలు అందరూ కూడా ఇప్పుడు గ్రామాలను ఖాళీ చేసి పంట పొలాల్లో నివాసం ఉంటున్నారు. సామాను, తమకు ఉండే ఆవులు గేదెలను తమతో తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ పొలాల్లోకి ఎవరిని రావొద్దని మా బ్రతుకు తాము బ్రతుకుతామని వారు స్పష్టంగా చెప్తున్నారు. నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ప్రజలు ఇప్పుడు పంట పొలాల్లోకి ఎక్కువగా వెళ్ళిపోయి తమను తాము కాపాడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version