వైద్యుల భద్రతకు తెలంగాణా కీలక నిర్ణయం…!

-

దేశం ఇప్పుడు దండం పెట్టాల్సిన వ్యక్తులు వైద్యులు. పోలీసులు ఎంత కట్టడి చేసినా సరే కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. వైద్యులు అందరూ కూడా ఇప్పుడు తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రజల కష్టాలను అర్ధం చేసుకుని తమ విధులకు సెలవలు లేకుండా వైద్యులు హాజరవుతున్నారు. దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం వైద్యులు ఇదే చేస్తున్నారు.

అయితే కొంత మంది దరిద్రులు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళ మీద అనవసరంగా దాడులకు దిగుతున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణా పోలీస్ శాఖ వైద్యుల భద్రతకు కీలక నిర్ణయం తీసుకుంది. వాళ్ళ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీ మహేందర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వైద్యుల రక్షణ కోసం పోలీసు కమిషనరేట్లు, జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో, వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ట్విట్టర్ లో కీలక ప్రకటన చేసారు.

ఈ గ్రూపుల ద్వారా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని, వారికి ఏర్పడిన ఇబ్బందికి సంబంధించిన సమాచారాన్ని గ్రూపులో పోస్టు చేస్తే.. త్వరగా స్పందించేందుకు వీలు ఉంటుందని, హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని వైద్యులు, పోలీసులతో కలిపి ప్రత్యేకంగా మెడికల్ వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. దీంతోపాటు నగర పరిధిలోని వైద్యులు, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, హెల్త్ వర్కర్లు, ఆశా వర్కర్లను కలిపి నోడల్ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశామని ఆయన ట్వీట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version