ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిణామాలు వైసిపి కి ఎంత వరకు కలిసొస్తాయి ఏంటి అనేది పక్కన పెడితే కొంత మంది వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం వైసీపీ అధిష్టానాన్ని చాలా ఇబ్బంది పెడుతుంది. సీఎం జగన్ అన్ని విధాలుగా కష్టపడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న తరుణంలో కొంతమంది వైసీపీ నేతలు వర్గ విభేదాలు దళితులపై దాడులు వంటివి చేయడంతో… వైసిపి అధిష్టానాన్ని తీవ్రంగా ఈ వ్యవహారాలూ ఇబ్బంది పెడుతున్నాయి. సీఎం జగన్ హెచ్చరించిన సరే… పార్టీ అధిష్టానం చర్చలు జరిపినా కొంతమంది మాత్రం రోడ్ల మీదకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసిపి అధిష్టానాన్ని బజారుకీడుస్తున్నారు.
కొంతమంది మంత్రులు కూడా ఇదే విధంగా వ్యవహరించడంతో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. దీనితో సీఎం జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో కొన్ని వార్తలు వినపడుతున్నాయి. ఇక నుంచి మంత్రులు గానీ ఎమ్మెల్యేలు గానీ ఏదైనా సివిల్ తగాదాల తల దూర్చిన సరే… అవినీతి వ్యవహారాల్లో ఉన్నా సరే వారిని పార్టీ నుంచి బహిష్కరించడమే కాకుండా పదవుల నుంచి వెంటనే తప్పిస్తూ ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. విచారణ అనంతరం వారి పై వచ్చిన ఆరోపణలు నిజం కాదు అని తేలితే తిరిగి పార్టీలోకి తీసుకోవాలని సీఎం జగన్ ఒక ఆలోచన చేస్తున్నారు.
ఈ మేరకు పార్టీ అగ్రనేతలు ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. అనవసర విషయాల్లో ఎవరైతే తలదూర్చి ఇబ్బందులు పెడుతున్న… వారందరి మీద కూడా పార్టీ అధిష్టానం ఒక కన్నేసి ఉంచింది. దళితులపై దాడుల విషయంలో అదే విధంగా పోలీసులు అడ్డంపెట్టుకుని కొంత మంది వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై విపక్షాల ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం పరువు కూడా పోయే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే ముగ్గురు నలుగురు మంత్రుల వ్యవహారంలో ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడింది. అందుకే క్షమించరాదు అని… ఇదే గనుక కొనసాగితే… అనవసరంగా విపక్షాలు చేతికి జుట్టు ఇచ్చినట్టే ఉంటుందని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇలా వ్యవహరించే ఎవరిని కూడా క్షమించే అవకాశమే లేదని ఆయన ఇప్పటికే సంకేతాలు కూడా పంపించారు. త్వరలోనే ఒక మంత్రికి ఏపీ కేబినెట్ నుంచి ఉద్వాసన ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా.