బీజేపీ దూకుడు వెనుక పవన్ ? తిరుపతి వదిలేసినట్టే ?

-

గత కొద్ది రోజులుగా చూసుకుంటే , ఏపీ బిజెపి నాయకుల వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడు లేని విధంగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు మొదలుపెట్టారు. మొదట్లో మూడు రాజధానులకు మద్దతు పలికిన బీజేపీ ఇప్పుడు అమరావతిలో రాజధాని అంటూ కొత్త పల్లవి అందుకుంది. అంతేకాదు తిరుపతి కేంద్రంగా బిజెపి నాయకుల పర్యటనలు, సమావేశాలు నిర్వహిస్తూ, వైసిపి ప్రభుత్వం పైన , అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ , ప్రజల్లో బిజెపి పై చర్చ జరిగే విధంగా చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇదంతా తిరుపతి పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసేందుకు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ జనసేన బీజేపీ లలో ఎవరు పోటీ చేస్తారు అనేది ఇప్పటికే ఒక కమిటీని వేసుకున్నారు. కానీ ఆ కమిటీ ప్రకటన రాకముందే, ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతిలో జనసేన బలపరిచిన బిజెపి అభ్యర్థి పోటీ చేస్తారు అని ప్రకటించేశారు. ఈ పర్యటన పై జన సైనికులు భగ్గుమన్నారు.

కనీసం మిత్ర ధర్మం కూడా పాటించకుండా, వీర్రాజు ఏకపక్షంగా నిర్ణయం ప్రకటించారు అని మండిపడ్డారు. అయితే బిజెపి ఎన్నికల ప్రచారం నిర్వహించడం, బిజెపి అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించడం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పవన్ తిరుపతి ఉప ఎన్నికలలో పోటీ చేసే విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వద్ద ప్రస్తావించారని, ఆ సందర్భంగా తిరుపతి స్థానాన్ని బీజేపీకి వదిలి వేసేందుకు ఆయన అంగీకరించారు అనే విషయాన్ని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే సోము వీర్రాజు ఆ ప్రకటన చేశారనే విషయాన్ని వారు చెబుతున్నారు. సోము వీర్రాజు తిరుపతి లో పోటీ చేస్తాము అనే ప్రకటన చేసినా, పవన్ మౌనంగా ఉండడానికి కూడా కారణం ఇదే అని తెలుస్తోంది. కాకపోతే ఆ విషయాన్ని పవన్ బహిరంగంగా చెప్పి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ ఆ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించకపోవడం తోనే ఇప్పటివరకు ఎక్కడలేని గందరగోళం నెలకొంది.

కాకపోతే ఇప్పుడు జనసేన బీజేపీ లు విడివిడిగా ప్రజా సమస్యల విషయంలో పోరాడుతూ వస్తుండడం తో, పొత్తు పై అనేక అనుమానాలు నెలకొన్నాయి. అసలు తిరుపతిలో పోటీ విషయంపై ఎప్పుడూ బిజెపి నాయకులే ప్రకటనలు చేస్తున్నారే తప్ప జనసేన పెద్దగా స్పందించకపోవడంతో ఎక్కడలేని గందరగోళం తలెత్తినట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version