చంద్రబాబు అవకాశవాది, ఎవరినైనా లవ్‌ చేస్తాడు : సోము వీర్రాజు

-

చంద్రబాబు అవకాశవాది, ఎవరినైనా లవ్‌ చేస్తాడని..ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైనప్పుడే లవ్‌ చేయడంలో చంద్రబాబు సమర్థుడు.. గతంలో కాంగ్రెస్‌ను కూడా లవ్‌ చేశారని చురకలు అంటించారు సోము వీర్రాజు. చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారని… చంద్రబాబు అవకాశవాది.. అవసరమైనప్పుడు లవ్ చేస్తారు.. ఆ తర్వాత ఏం చేస్తారో నా నోటితో నేను చెప్పన అంటూ ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు సోము వీర్రాజు.

అవసరం తీరాక మామ నుంచి బీజేపీ వరకు చంద్రబాబు ఏం చేశారో అందరికీ తెలుసు అని చురకలు అంటించారు. జనసేన పార్టీ తమ మిత్ర పక్షమన్నారు. ప్రధాని మోడీ భద్రతకు భంగం వాటిల్లింప చేసేలా పంజాబులో పరిస్థితులు సృష్టించారని… ప్రధాని విషయంలో జరిగిన వ్యవహరంపై నిరసనలు తెలియ చేస్తామని హెచ్చరించారు. ఇవాళ సాయంత్రం గవర్నరును కలుస్తామని చెప్పారు సోము వీర్రాజు.

Read more RELATED
Recommended to you

Exit mobile version