మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పరికిబండ రిజర్వ్ ఫారెస్ట్‌లో మనిషి పుర్రె, ఎముకలు కలకలం సృష్టించాయి. ఎస్సై రాజుగౌడ్ తెలిపారు. డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి బాల కృష్ణంరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పరికిబండ రిజర్వ్ ఫారెస్ట్‌లో పనులు చేస్తున్న కూలీలు అటవీ ప్రాంతంలో మనిషి పుర్రె, ఎముకలను గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఆ ఎముకలు ఎవరివి.. అది హత్యా..? ఆత్మహత్యా.. ? అని నిర్థారించే పనిలో పడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.