ఏపీ సర్కార్‌ పై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు..వచ్చేది మా ప్రభుత్వమే !

-

ఏపీ సర్కార్‌ పై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి కాల్వల్లో పూడిక కనిపించడం లేదా..? పంట కాల్వల, డ్రెయిన్ల నిర్వహణ ఒక నిరంతర ప్రక్రియలా సాగాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ పూడికతీత అంశాన్ని నిర్లక్ష్యం చేశాయని.. పొలాలనుంచి డ్రెయిన్లలో పారే నీటిలో తప్పనిసరిగా సిల్టు ఉంటుంది.. అది కాల్వల్లో పేరుకుపోతుందని.. గుర్రపుడెక్క వంటి కలుపును వెంట వెంటనే తీయకపోతే విపరీతంగా వృద్ధిచెంది నీటి ప్రవాహాలను అడ్డుకుంటుందని పేర్కొన్నారు.

ఇవన్నీ ఇరిగేషన్ అధికారులకు తెలుసు, ప్రభుత్వాలకూ తెలుసు. కానీ వాటికి నిధులు కేటాయించటం వృధా అనుకుంటున్నారని… దానివల్ల ఓట్లు రావు.. పంచితే ఓట్లు వస్తాయన్న భావనతో పాలన సాగిస్తున్నారని తెలిపారు. అందుకే రోడ్లు వేయరు, పంట కాలవలు, డ్రెయిన్లు క్లీన్ చేయరని.. కనీసం వేసవిలో నరేగా నిధులతో ఈ పనులు చేసేలా ఉపాధి కూలీలను ప్రోత్సహించవచ్చని వెల్లడించారు.

తూతూ మంత్రంగా పనులే చేసి ఆ నిధులు పంచుకోవాలని.. ఇంత దుర్మార్గం జరుగుతోంది కనుకనే రైతులు వరి వేయం అంటున్నారన్నారు. ప్రభుత్వం కళ్ళు తెరవాలి… ప్రభుత్వ పెద్ద బాధ్యతగా ఉంటే రాష్ట్రం ముందుకు వెళుతుంది… ఉన్న నిధులనే పొదుపుగా, సక్రమంగా, అవినీతి రహితంగా వాడితే ఈ పనులన్నిటీ నిధులు ఉంటాయన్నారు. అసలు ప్రభుత్వమే నిర్లక్ష్యంతో అసమర్ధతతో పూడిపోతే వీటిని పట్టించుకునేదెవరు? రైతులతో కలసి ప్రభుత్వం పై వత్తిడి తీసుకుని వస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version