బాబు బీజేపీని చూసినట్లే… బాబుని వీర్రాజు చూస్తారంట!

-

చంద్రబాబు విషయంలో వీర్రాజు ఏమీ తగ్గడం లేదు. బీజేపీ వీరభక్తుడు అయిన వీర్రాజు.. ఏబీవీపీ కార్యకర్త స్థాయి నుంచి నేడు ఏపీ బీజేపీ అధ్యక్షుడైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ ఎందుకు ఎదగలేకపోయింది.. ఏపీలో బీజేపీ ఎదుగుదలను వ్యూహాత్మకంగా తొక్కేసింది ఎవరు.. బీజేపీని ఎప్పటికప్పుడు నమ్మించి వాడుకుని వదిలేసింది ఎవరు.. అనే విషయాలపై పూర్తి స్పష్టత ఉన్న వీర్రాజు… బాబుపై పూర్తి కాన్సంట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది!

తాజాగా ఒక ప్రముఖ ఛానల్ లో మాట్లాడిన వీర్రాజు… 1996 తర్వాత ఒక దశా దిశతో ముందుకు వెళ్లే అవకాశం వచ్చిందని కానీ నాడు 18శాతం ఉన్న ఓటు బ్యాంకును సంపాదించుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారని.. అనంతరం ఆ 18శాతం కాస్త సున్నాకి పడిపోయిందని.. పైగా తర్వాతి ఎన్నికల్లో బీజేపీ వల్లే టీడీపీ ఇబ్బందులు పడిందని చెప్పుకొచ్చారు చంద్రబాబు అని గతాన్ని గుర్తుకుతెచ్చుకుని ఫైరవుతున్నారు వీర్రాజు!

ఇదే సమయంలో… 2004, 2009 లో కూడా ఆ సున్నా ఫలితాలు అలానే ఉండిపోయాయని… అనంతరం 2019లో మోడీ రావడంతో ఇక ఏపీలో బీజేపీ కాస్తో కూస్తో ఎదుగుతుందని భావించినప్పటికీ.. మళ్లీ బాబు తగులుకుని దెబ్బకొట్టారని.. ఇకపై ఆ పరిస్థితి రానివ్వనని చెబుతున్నారు వీరరజు. నాడు బీజేపీని చంద్రబాబు ఎలా ట్రీట్ చేశారో.. మరెలా చూశారో… బాబుని, టీడీపీని తాను కూడా అలానే చూస్తానని చెబుతున్నారు వీర్రాజు! దీంతో… బాబు ఫ్యూచర్ కి వీర్రాజు బలంగానే స్కెచ్ లు వేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version