సీఎం జగన్ బటన్ నొక్కుడు ముఖ్యమంత్రిగా మారాడని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేటితో బిజేపి యువమోర్చ యువ సంఘర్షన యాత్ర ముగిసింది. ఈ ముగింపు సభలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు… సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అనేక వనరులు వున్నాయని.. విభజనకు పూర్వం హైదరాబాద్ రాజధాని కావటంతో అక్కడే అభివృద్ధి అంతా అక్కడే జరిగిందని ఆగ్రహించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి లేదు… అసమర్థ అవినీతి కుటుంబ పాలన మాత్రమే వుందని.. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి లేదని తెలిపారు. అన్నీ వర్గాల ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని.. దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ వుంటే 3 ఏపి కి కేంద్రం ఇచ్చిందని తెలిపారు.
రాష్ట్రంలో ఉద్యోగ కల్పన లేదని.. వీటిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేస్తే 4 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. కాకినాడ లో పెట్రోలియం కాంప్లెక్స్ పూర్తయితే యువతకి ఉద్యోగాలు వస్తాయని.. పెద్ద తూఫాన్ వస్తె తప్ప సియం బయటకి రాడని మండిపడ్డారు. సియం వెనుక భజన బ్యాచ్ వుందని.. ప్రభుత్వానికి ఇంతటితో వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.