మెటర్నిటీ ఫొటో షూట్..మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న సోనమ్ కపూర్..

-

బాలీవుడ్ అందాల భామ సోనమ్ కపూర్..తన అందంతో ఎప్పుడు కనువిందు చేస్తుంటుంది.‘సావరియ’ సినిమాతో బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసిన సోనమ్ కపూర్..ఆ తర్వాత కాలంలో అతి తక్కువ చిత్రాలలో నటించి స్టార్ స్టేటస్ పొందింది. ‘ప్రేమ రతన్ దన్ పాయో’ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ పక్కన క్లాస్ లుక్ లో కనిపించింది సోనమ్.

ఈ సినిమాలో తన నటనకు ప్రేక్షకులు వందకు వంద మార్కులు వేశారు. ఇక సోనమ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే..ఆనంద్ అహుజాని పెళ్లి చేసుకొని కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సోనమ్ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నది.

ఈ క్రమంలోనే బేబీ బంప్ తో మెటర్నిటి ఫొటో షూట్ చేసింది. క్రీమ్ కలర్ డ్రెస్ లో దిగిన ఫొటోస్ అభిమానులతో పంచుకుంది.ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సదరు ఫొటోలు చూసి నెటిజన్లు కంగ్రాట్స్,హ్యాపీ మూమెంట్స్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version