‘ప్రభవించే రవి రాజుదే’ అంటూ…..’ఆపరేషన్ వాలెంటైన్’ నుంచి సాంగ్ రిలీజ్

-

కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’.ఈ చిత్రంలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ కథానాయికగా నటిస్తున్నారు.నవదీప్, రుహానీ శర్మ, మీర్ సర్వర్ కీలక పాత్రలు పోషించారు.వరుణ్ కెరియర్ లో మొట్టమొదటి హిందీ ప్రాజెక్ట్ గా వస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఇదిలా ఉంటే…ఈ చిత్రం నుంచి సాంగ్ రిలీజైంది. ‘ప్రభవించే రవి రాజుదే’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు.ఈ మూవీకి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీ రన్ టైమ్ 2.04 గంటలు ఉన్నట్లు మేకర్స్ తెలిపారు.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్, మానుషీ జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news