కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొంది చివరకు చట్టరూపం దాల్చినప్పడికి కూడా ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీలు వ్యవసాయ బిల్లు పై విమర్శల పర్వం మాత్రం ఆపడం లేదు. ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి వ్యవసాయ బిల్లుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోనే ఉన్నారూ . కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు కారణంగా రైతులకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉందని ఇప్పటికైనా ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
అయితే ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు పేరుతో రైతులకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైంది అంటూ విమర్శించిన సోనియాగాంధీ… కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తూనే ఉంటుంది అంటూ తెలిపారు. దేశం యొక్క బలం కేవలం పల్లెల్లోనే ఉంటుంది అంటూ తెలిపిన సోనియా గాంధీ… అందుకే అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జై కిసాన్ జై జవాన్ అనే నినాదాన్ని తెరమీదికి తెచ్చారు అంటూ గుర్తు చేశారు.