రాజ్ భవన్ రాజకీయ డ్రామాలకు వేదిక కాదని తెలంగాణా గవర్నర్ తమిళిసై అన్నారు. గత నాలుగు నెలలుగా ఫిర్యాదులు ఈ మెయిల్ ద్వారానే తీసుకుంటున్నామన్న ఆమె కాంగ్రెస్ నేతలను కూడా ఈ మెయిల్ ద్వారానే పంపించమని ఆడిగామని అన్నారు. సామాన్య ప్రజలకు, రాజకీయ పార్టీలకు కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నామని ఆమె అన్నారు. కేంద్ర తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్లో చాలా మంచి అంశాలు ఉన్నాయన్న ఆమె వాటిని హై లైట్ చేయాలని అన్నారు.
నాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశ్యాలు లేవన్న ఆమె నేను గవర్నర్ ని కావొచ్చు కానీ దేశ పౌరురాలిని నాకు కొన్ని హక్కులు ఉంటాయని అన్నారు. విపక్షాలకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ చట్టాల పై వేరే అభిప్రాయాలు ఉండొచ్చని కానీ ఇప్పుడు చేసిన ఈ చట్టాల వల్ల ప్రజలకు లబ్ది చేకూరుతుందని అన్నారు. నాకు వ్యవసాయం పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందన్న ఆమె కోవిడ్ తెలంగాణ లో కంట్రోల్ లోనే ఉందని ఇప్పుడు ప్రభుత్వం నియంత్రణ విషయంలో చర్యలు తీసుకుంటుందని అన్నారు. రోల్ మోడల్ గా ఉండాల్సిన రాజకీయ పార్టీలు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని ఆమె అన్నారు.