Helping Star : మ‌రోసారి సేవాగుణం చాటిన సోనూ సూద్.. వీడియో వైర‌ల్

-

సోనూ సూద్ అంటే ఒకప్పుడు విలన్. సినిమాల్లో క‌నిపించినా.. సోనూను హీరో ఎప్పుడు చిత‌కబాదుతాడు అని చూసే వాళ్లం. కానీ క‌రోనా వైర‌స్ వ‌ల్ల సోనూసూద్ హీరోయిజాన్ని యావ‌త్ ప్ర‌పంచం చూసింది. క‌రోనా వైర‌స్ క‌ష్ట కాలంలో వేలాది మంది సోనూ సూద సాయం చేశాడు. దీంతో ఆయ‌నకు ఏకంగా హెల్పింగ్ స్టార్ అనే బిరుదును కూడా ఇచ్చేశారు. అలాగే వేలాది మంది అభిమానుల‌ను కూడా సోనూసూద్ సొంతం చేసుకున్నారు. దీంతో సోనూసూద్ ను విల‌న్ పాత్ర‌లలో ప్ర‌జ‌లు జీర్ణించుకోవ‌డం లేదు.

అంత‌లా అభిమానాన్ని సోనూసూద్ సొంతం చేసుకున్నారు. కాగ సోనూసూద్ మ‌రోసారి త‌న సేవాగుణాన్ని చాటుకున్నారు. తాజా గా ఈ రోజు పంజాబ్ రాష్ట్రంలో రోడ్డు ప్ర‌మాదానికి గురి అయిన ఒక వ్య‌క్తిని కాపాడాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ వీడియో లో పంజాబ్ లోని కోట‌క్ పూరా బైపాస్ వ‌ద్ద ఒక వ్య‌క్తి కారు ప్ర‌మాదం జ‌రిగి ఆప‌స్మార‌క ప‌రిస్థితిలో ఉన్నాడు. అదే స‌మ‌యంలో అటు నుంచి కారులో వెళ్తున్న సోనూ సూద్ గ‌మ‌నించి.. సాయం చేశారు.

సోనూ సూద్ స్వ‌యంగా గాయప‌డ్డ వ్య‌క్తిని చేతుల‌తో ఎత్తుకుని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అంతే కాకుండా ఆ వ్య‌క్తికి చికిత్స అందించేంత వ‌ర‌కూ సోనూ సూద్ అక్క‌డే ఉన్నారు. దీంతో ఆ వ్య‌క్తి ప్రాణాల‌తో బ‌య‌ట పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ కాగ నెటిజ‌న్లు సోనూ సూద్ సేవాగుణానికి అభినంద‌న‌లు తెలిపారు. హెల్పింగ్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news