ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కొత్త విధానం.. వాహనాలపై రంగుల స్టిక్కర్లు వేస్తారట..!

-

దేశ రాజధాని ఢిల్లీలో ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు గతంలో సరి, బేసి విధానాన్ని అమలు చేసిన విషయం విదితమే. అయితే ఇకపై వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు మరో కొత్త ప్రణాళికను అమలు చేయనున్నారు. డీజిల్, పెట్రోల్ వాహనాలపై రంగుల స్టిక్కర్స్ అతికించనున్నారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుని దానికి ఆమోదం తెలిపింది.

ఇకపై ఢిల్లీలో వాహనాలకు రంగుల స్టిక్కర్స్ అతికించనున్నారు. డీజిల్ వాహనాలకు ఆరెంజ్ కలర్, పెట్రోల్, సీఎన్‌జీ వాహనాలకు బ్లూ కలర్ స్టిక్కర్లను అతికిస్తారు. ఇక ఆ స్టిక్కర్‌పై వాహనాన్ని ఎప్పుడు తయారు చేశారనే విషయాన్ని తెలియజేసే సంవత్సరాన్ని పొందుపరుస్తారు. దీంతో పాత వాహనాలను గుర్తించడం తేలికవుతుంది. ఇక ఈ స్టిక్కరింగ్ విధానాన్ని సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అమలు చేయనున్నారు.

పారిస్‌లో ఇప్పటికే ఇలా స్టిక్కరింగ్ విధానం అమలు చేస్తున్నారట. ఇది ఢిల్లీలో గతంలో ప్రవేశపెట్టబడిన సరి, బేసి విధానం కంటే ఎంతో మెరుగ్గా పనిచేస్తుందట. పాత వాహనాలను ఈ కొత్త విధానం వల్ల సులభంగా గుర్తించవచ్చట. అలాగే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు గ్రీన్ నంబర్ ప్లేట్లను కూడా కేటాయించే విధానాన్ని త్వరలో పరిశీలించనున్నారు. దీనిపై కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ త్వరలో నిర్ణయం తీసుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news