శ్రీనివాస కళ్యాణం ఎన్టీఆర్ చేస్తే..!

-

శతమానం భవతి సినిమాకు ప్రాంతీయ సినిమా విభాగంలో నేషనల్ అవార్డ్ అందుకున్న సతీష్ వేగేశ్న తన సెకండ్ మూవీగా శ్రీనివాస కళ్యాణం సినిమాతో వచ్చాడు. నితిన్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా శతమానం భవతిలానే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. నితిన్ ఏరికోరి మరి చేసిన ఈ సినిమాపై దిల్ రాజు నమ్మకంగా ఉన్నాడు.

అయితే రిలీజ్ తర్వాత దిల్ రాజు కూడా షాక్ అయ్యాడని తెలుస్తుంది. ఈ సినిమాపై నమ్మకంతో దిల్ రాజు సినిమాను ఎన్.టి.ఆర్, రాం చరణ్ దగ్గరకు తీసుకెళ్లాడట వారిలో ఎవరో ఒకరితో ఈ సినిమా చేయాలని ప్రయత్నించాడట. ఎన్.టి.ఆర్ తో సతీష్ తో స్టోరీ డిస్కషన్స్ పెట్టించాడట. తారక్ మాత్రం సినిమా కాదనేశాడు.

సినిమా రిజల్ట్ చూశాక హీరోయిజం లేని హీరో పాత్రలో ఎన్.టి.ఆర్ చేస్తే ఎలా ఉండేదో కాని ఆ సినిమా కాదని మంచి పనిచేశాడని అంటున్నారు. తారక్ మాత్రమే కాదు రాం చరణ్ తో పాటుగా సాయి ధరం తేజ్ కూడా ఈ సినిమాకు ముందు హీరోగా అనుకుని మిస్ చేసుకున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news