ఇక‌పై ఫోన్లు 15 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ అవుతాయి..!

-

ప్ర‌ముఖ చిప్ త‌యారీదారు క్వాల్‌కామ్ ఓ స‌రికొత్త చార్జింగ్ టెక్నాల‌జీని ఆవిష్క‌రించింది. క్వాల్‌కామ్ క్విక్ చార్జ్ 5.0 పేరిట ఈ ప్లాట్‌ఫాంను ఆ సంస్థ ప్ర‌వేశ‌పెట్టింది. దీని వ‌ల్ల ఫోన్లు చాలా వేగంగా చార్జ్ అవుతాయి. 100 వాట్ల చార్జింగ్ ప‌వ‌ర్‌ను ఫోన్లు క‌లిగి ఉంటాయి. ఈ ప్లాట్‌ఫాం ఉన్న ఫోన్ల‌లో చార్జింగ్ చాలా వేగంగా పూర్త‌వుతుంది.

క్వాల్‌కామ్ క్విక్ చార్జ్ 5.0 టెక్నాల‌జీతో ఫోన్లు కేవ‌లం 5 నిమిషాల వ్య‌వ‌ధిలోనే 0 నుంచి 50 శాతం వ‌ర‌కు చార్జింగ్ పూర్త‌వుతాయి. అలాగే 15 నిమిషాల్లోనే 0 నుంచి 100 శాతం చార్జింగ్ పూర్త‌వుతుంది. దీంతోపాటు క్వాల్‌కామ్ బ్యాట‌రీ సేవ‌ర్ అనే ఫీచ‌ర్ కూడా ఈ ప్లాట్‌ఫాంలో ఉంటుంది. అందువ‌ల్ల ఫోన్ బ్యాట‌రీ సేవ్ అవుతుంది. ఇక బ్యాట‌రీ లైఫ్ కూడా పెరుగుతుంది. బ్యాట‌రీ ఎక్కువ కాలం ప‌నిచేస్తుంది.

గ‌తంలో క్వాల్‌కామ్‌కు చెందిన క్విక్ చార్జ్ 4 టెక్నాల‌జీ ఉండేది. దానిక‌న్నా ప్ర‌స్తుత క్విక్ చార్జ్ 5.0 టెక్నాల‌జీ ఫోన్ల‌ను 10 రెట్లు వేగంగా చార్జింగ్ చేస్తుంది. అంతేకాదు.. బ్యాట‌రీ కూడా ఆదా అవుతుంది. దాని లైఫ్ పెరుగుతుంది. ఇక ఈ టెక్నాల‌జీని రానున్న రోజుల్లో నూత‌న స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెసర్ల‌లో క్వాల్‌కామ్ అందివ్వ‌నుంది. స్నాప్‌డ్రాగ‌న్ 865, 865 ప్ల‌స్ త‌దిత‌ర ప్రాసెస‌ర్లు ఉండే ఫోన్ల‌లో ఈ టెక్నాల‌జీని యూజ‌ర్లు ఉప‌యోగించుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version