దేశవ్యాప్తంగా కరోనా విస్తరణ నేపథ్యంలో పాఠశాలలు మూతపడ్డాయి. అయితే విద్యార్థులకు ఎటువంటి నష్టం కలగకుండా… కేరళ ప్రభుత్వం జూన్ 1న ‘ఫస్ట్ బెల్’ పేరుతో రాష్ట్ర అధికారిక ఛానెల్ కైట్ (కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్) విక్టర్స్ ద్వారా వర్చువల్ తరగతులను ప్రారంభించింది. ప్రస్తుతం వాటి సంఖ్య 1000 దాటింది. ‘ఫస్ట్ బెల్’ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 604 ఆన్లైన్ క్లాసులను ప్రసారం చేసినట్లు కైట్-విక్టర్స్ పేర్కొంది. కన్నడ మాధ్యమంలో 274, తమిళంలో 163 క్లాసులు ప్రసారం చేసినట్లు వెల్లడించింది.
టీవీ, స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్, కంప్యూటర్లో ఈ తరగతులను వీక్షించవచ్చని ఉపాధ్యాయులు తెలిపారు. విక్టర్స్ వెబ్సైట్, మొబైల్ యాప్, సోషల్ మీడియా పేజీల్లోనూ చూడొచ్చని పేర్కొన్నారు. www.facebook.com/victerseduchannel లింక్ సహాయంతో ఫేస్బుక్లైవ్ ద్వారా కూడా ఆన్లైన్ పాఠాలకు హాజరు కావచ్చని చెప్పారు. ఒకవేళ ఈ తరగతులకు హాజరు కాలేని విద్యార్థులు ప్రత్యమ్నాయ మార్గాలు అన్వేషించాలని సూచించారు.